పెన్షనర్లకు మధ్యంతర భృతి 30 శాతం ప్రభు త్వం వెంటనే ప్రకటిం చాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమదాలవలస పట్టణంలోని లక్ష్మీనగర్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ధాస్యం లక్ష్మణరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్టు పర్సన్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 12వ పీఆర్సీ నియమించి ఏడాది దాటిపో యిందని, ఇంతవరకు మ ధ్యంతర భృతి ప్రకటించకపోవడం దారుణమన్నారు. తక్షణమే 30 శాతంతో ప్రక టించాలని డిమాండ్ చేశారు. సంఘ గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్‌రావు మా ట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం సంఘ కోశాధికారి హెచ్‌వీ సత్యనారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపె ట్టారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ నాయకులు ఎన్.చంద్రశేఖరరావు, ఆర్.సత్య నారాయణ, కె.షన్ముఖరావు, బెండి సూర్యనారాయణ, పీవీఎన్ మాస్టార్, పి.భానోజీ రావు, బెండి నారాయణరావు, కె.సంజీవరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.