రాష్ట్రాభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీయిస్తామని చెప్పారు. అవసరమైన నిధులన్నింటినీ కేంద్రం అందజేస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ. కష్టపడి పనిచేసేవారికి పార్టీ సముచిత స్థానం లభిస్తుందని చెప్పడానికి తానే ఓ ఉదాహరణ అన్నారు. నాయకులు భానుప్రకా్షరెడ్డి, కోలా ఆనంద్, జల్లి మధుసూదన్, చంద్రప్ప, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.