మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకి పాల్పడ్డారంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డితో పాటు పలువురు టిడిపి బృందం కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.