ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బొబ్బిలి ఎస్బీఐ సెంటరులోగల అంబేడ్కర్ విగ్రహం ముందు పలువురు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా అంబేడ్కర్ పోరాట సమితి వ్యవస్థాపకుడు సోరు సాంబయ్య, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కౌలు చిరంజీవులు, బొక్కేన రాము ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు పాలకులు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. వర్గీకరణను పూర్తిగా విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు డి.గోపాలం, పి.సూర్యనారాయణ, సోమేశ్వరరావు, శీర రామారావు, ఎండ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.