నదుల అనుసంధాన ప్రక్రియపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు. నదీ జలాలు సముద్రంలో కలవకుండా ప్రతి నీటిబొట్టూ సాగుకు సద్వినియోగం చేయాలని, 26 జిల్లాల్లోని 4కోట్ల ఎకరాల్లో ప్రతి ఎకరాకూ సాగునీరందేలా కార్యాచరణ చేపట్టాలని వారిని సీఎం ఆదేశించనున్నారు. సోమవారం జరగబోయే కలెక్టర్ల సమావేశానికి జల వనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 5 భారీ రిజర్వాయర్లు, 35 చిన్నతరహా నదుల్లోని 38,422 మైనర్ ఇరిగేషన్ వనరుల ద్వారా సాగునీటిని అందించాలని సీఎం ఆదేశిస్తారు. నీటి విడుదలను కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించనున్నారు.