రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో, రామబాణంతో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 31వ తేది వరకు స్వామివారి శ్రావణమాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో భాగంగా నేడు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి రాజా స్వాముల నేతృత్వంలో అభిషేకం, ఆకుపూజ తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు.