పాలకొండ ఆర్డిఓ కార్యాలయ పరిపాలన అధికారిగా ఎస్ నరసింహమూర్తి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయ సిబ్బంది నరసింహమూర్తికి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకు కార్యాలయంలో వివిధ హోదాలలో గల సిబ్బంది సహకరించాలని పరిపాలన అధికారి ఎస్ నరసింహమూర్తి కోరారు.