బంగ్లాదేశ్లో నిరసనకారులు ఇంకా శాంతించడం లేదు. తాజాగా కొందరు అల్లరి మూకలు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఎంపీ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు. ఇటీవలే ఆయన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. రిజర్వేషన్ల అంశంపై ఆయన స్పందించకపోవడంతో ఇంటిపై దాడికి దిగారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కాలి బూడిదైంది.