బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో వివరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్ నుంచి ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి భారత్కు రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు పేర్కొంది.