విశాఖ జిల్లా సబ్బవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న రెండు ఆటోలను ఈనెల 7న వేలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్. శైలజారాణి ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు సబ్బవరం ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి. దుర్గాప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 7న సబ్బవరంలోని ఎక్సైజ్ కార్యాలయానికి హాజరై అధికారులను సంప్రదించాలన్నారు.