ఆగస్టు 9, 10 తేదీలలో సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో నిర్వహించనున్న ఆరవ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మంగళవారం పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణంలో బీసీ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాల కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.