చెన్నై కొత్తపల్లి మండలంలోని చందమూరు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనం బోల్తా పడి ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పెనుగొండ మండలం గుంటూరు గ్రామానికి చెందిన ఈ నాయక భాష ఆయన భార్య మల్లిక ఇరువురు ద్విచక్ర వాహనంలో ధర్మవరంకి వెళ్తూ ఉండగా ఎన్ఎస్ గేట్ రహదారిపై చందమూరు దగ్గర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఈ నాయక భాషకు స్వల్పంగా గాయాలు కాగా భార్య మల్లికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు తరలించారు.