సుప్రీం కోర్ట్ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు కోరారు. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల భవిష్యత్ పై సుప్రీం ధర్మాసనం చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.