కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో అప్పుల బాధ తాళలేక యువరైతు సూరి ఉరేసుకుని చనిపోయాడు. మంగళవారం ఉదయం తన పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సూరికి తన 5ఎకరాల పొలంలో పంటలు పండించినా పెట్టుబడి దక్కక అప్పుల పాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం తెలియక చావే శరణ్యంగా భావించి చెట్టుకురేసుకున్నాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు.