కొరిసపాడు మండలం మేదరమెట్లలోని రాజీవ్ నగర్ నందు మంగళవారం అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి పాల్గొని తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి ఆమె గర్భిణీలు, బాలింతలకు వివరించారు. తల్లిపాలతో బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ కృష్ణవేణి తెలిపారు. డబ్బా పాలతో పిల్లలు అనారోగ్యం బారిన పడతారని ఆమె చెప్పారు.