ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 19, 20 వార్డుల గ్రామ సచివాలయాలకు మంగళవారం టిడిపి నాయకులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చిత్రపటాలను టిడిపి నాయకులు కార్యకర్తలు బహూకరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు వీరి చిత్రపటాలను గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని టిడిపి నాయకులు అధికారులను కోరారు.