ఆముదాలవలస స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసన్నపేటకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయంగా మారిందని వాహనదారులు మంగళవారం తెలిపారు. వర్షం నీరు అందులో చేరి ప్రమాదాలకు గురవుతున్నామని అన్నారు. నీళ్లుతో నిండింన రోడ్డు గుంతలలో వాహనాలు వెళుతుండడంతో రాళ్లు పైకి తేలుతున్నాయని వాపోయారు. రహదారి మరమ్మత్తులు తక్షణమే చేపట్టి ప్రమాదాలను నివారించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.