ఖరీఫ్ సీజన్ 2024 కు సంబంధించి రైతులు ఈ- పంట నమోదు తప్పని సరిగా చేసుకోవాలని ఆముదాలవలస మండలం సైలాడ రైతు సేవా కేంద్రం వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. రైతులు తమ రెవిన్యూ పరిధిలో సాగు భూమి ఖాతా నెంబర్లను సర్వే సబ్ డివిజన్ వారీగా వేసిన పంటను నమోదు చేసుకోవాలని సూచించారు. పంట నమోదు ఫారం నింపిన తర్వాత రైతు సేవా కేంద్రంలో వాటిని అందించాలని కోరారు.