ఎన్నికల ముందు వరకూ ఈరాష్ట్రం బాధ్యత చంద్రబాబుది. ఎన్నికలయ్యాక అమరావతి సహా ఈ రాష్ట్రం బరువు, బాధ్యత ప్రజలది. దీంట్లో భాగంగా అమరావతి నిర్మాణంకోసం ఇప్పుడు విరాళాల సేకరణ జరుగుతోంది. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఇటుకలు అమ్మి విరాళాలు సేకరించిన చంద్రబాబు ఇప్పుడు డ్వాక్రా సంఘాలపై పడ్డాడు. ప్రతి సంఘ సభ్యురాలు కూడా విరాళం ఇవ్వాలని ఇదిగో ఇలా ఆదేశాలిస్తున్నారు. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాలు, మెప్మా తరఫున రూ.4.5 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు సేకరణకోసం అధికారులు సహా, సంఘ లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు.