నంద్యాల జిల్లాలో ఈనెల 15వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ పద్మజ పాల్గొన్నారు.