చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి నిత్య ఆన్నదాన ట్రస్టుకు ఏలూరుకు చెందిన దాత బాలకృష్ణ రూ. 1. 25 లక్షలు విరాళంగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ వాసుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. ఆలయ అధికారులు దాతకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.