గత ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదని, ఎన్డిఏ చేతల ప్రభుత్వం అని రైల్వే కోడూరు అభివృద్దే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గురించి కథలు చెప్పే నాయకులు నాలుగు సార్లు గెలిపిస్తే ఏమి చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైల్వే కోడూరు ను అత్యంత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు.