శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.