తొండూరు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తొండూరు మండల వైద్యాధికారి డాక్టర్ అరిఫుల్లా సూచించారు. బుధవారం మండల కేంద్రమైన తొండూరు పీహెచ్సీ నందు ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన ఊపిరితిత్తుల వ్యాధుల గురించి, దోమల ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధుల గురించి వివరించాలని చెప్పారు. తల్లిపాల వారోత్సవాల ర్యాలీ చేపట్టారు.