బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టడంతో చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మైదుకూరు పదవ వార్డు సచివాలయ మహిళా పోలీస్ కే. సునంద అన్నారు. బుధవారం మైదుకూరులోని వెంకటసుబ్బయ్య కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో తల్లులకు తల్లిపాలు యొక్క ఆవశ్యకతను వివరించారు. తల్లులు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఏఎన్ఎం ఉమాదేవి, అంగన్వాడి కార్యకర్త సుమతి పాల్గొన్నారు.