వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎస్‌ఆర్‌సీ రిపోర్టు రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని మండిపడ్డారు. జగన్ ఓడిపోయాడు.. కానీ చావలేదని స్వయంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని.. ఇలాంటి పరిస్థితుల్లోనే సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామని చెప్పారు.చంద్రబాబు జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.జగన్‌కు ఎక్కువ భద్రత ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేశారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మంది సెక్యూరిటీ ఉన్నారని ప్రచారం చేశారని గుర్తుచేశారు. అప్పట్లో జగన్‌కు ఉన్నది కేవలం 139 మంది సెక్యూరిటీనే అని స్పష్టం చేశారు.జగన్ కాన్వాయ్‌లో ల్యాండ్‌క్రూజర్ కార్లు ఉన్నాయని లోకేశ్ అంటున్నారని.. ల్యాండ్ క్రూజర్ ఎక్కడుందో చూపించాలని లోకేశ్‌కు సవాలు విసిరారు. ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ తెచ్చుకున్నారని అన్నారు.చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.