శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో "సెల్ అండ్ సీక్" అనే వర్క్ షాప్ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ కె. సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. ఇటువంటి "వర్క్ షాప్స్" అధ్యాపకులకు ఎంతో అవసరము అని, నూతన పాఠ్యాంశాలలోని బోధన, మెళుకువలు ఇటువంటి వర్క్ షాప్స్ ద్వారా నేర్చుకోవచ్చన్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు ఈ వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు.