ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులంతా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో జరిగిన చేనేత దినోత్సవంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేతలకు మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో 27 రకాల సంక్షేమ పథకాలను అందించారన్నారు. వారి జీవితాల్లో నూతన వెలుగు రేఖలు తీసుకొచ్చారన్నారు. నూతన సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేసి వారి ఆదాయం పెంపునకు కృషి చేశారని అనురాధ తెలిపారు. అధునాతన రాట్నాలు, మగ్గాలు ఉచితంగా అందించారని పంచుమర్తి అనురాధ తెలిపారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చారన్నారు. అందుకే లోకేష్ ను 91,413 భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించారన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని పంచుమర్తి అనురాధ తెలిపారు. వర్షం కారణంగా సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయ్యింది. నేడు చీరాలలో జరిగే చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఇది రద్దైంది. చంద్రబాబు విజయవాడలో జరిగే చేనేత కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పెడనలో చేనేత తయారీ మగ్గాలను జిల్లా కలెక్టర్ బాలాజీ , పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు.