మాలలకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలను కూలుస్తామని జేఏసీ చైర్మన యాట ఓబులేసు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మంగళవారం కర్నూలు నగరంలో మాలమహానాడు అధ్వ ర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవన నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ వర్గీకరణతో మాల కులస్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంటు తీర్మా నం లేకుండ, రాజ్యాంగలోని ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంటు, రాష్ట్రపతి మోదం లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నిం చారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళిజ్యోతి, మునయ్య, మాధవ స్వామి, మాదాసు నాగరాజు, వెంకటేష్, రాజీవి, సామేల్, నవీన పాల్గొన్నారు.