కర్నూలు నగరంలోని పాతబస్టాండులో పడగొట్టిన మున్సిపల్ ఓపెన ఎయిర్ థియేటర్ (ఆరుబయలు కళామందిరం)కు బదులుగా నగరంలో వేరొక చోట ఓపెన థియేటర్ నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం నగరంలోని మౌర్యఇనలో గల మంత్రి కార్యాలయంలో జిల్లా రంగస్థల కళాకా రుల సంఘం ఆధ్వర్యంలో రంగస్థల కళాకారులు ఓపెన ఎయిర్ థియేటర్ కోసం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకా రులు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి పేద కళా కారులకు అందు బాటులో ఉంటే మున్సిపల్ ఓపెన థియేటర్‌ను గత ప్రభుత్వంలో కూల్చివేసి, దాని స్థానంలో పార్కును నిర్మించిందని, దానికి ప్రత్యామ్నాయంగా ఎలాం టి థియేటర్ నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత స్పందిస్తూ ప్రభుత్వం తరపున కృషిచేసి, ఓపెన ఎయిర్ థియేట ర్‌ను నిర్మిస్తామని కళాకారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీజీవీ కళా క్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కళాకారుల సంఘం అధ్యక్షుడు గుర్రప ుశాల అంకయ్య, సీనియర్ కళాకారులు వీవీ రమణారెడ్డి, పి. దస్తగిరి, ఎం. మనోహర్‌బాబు, కృష్ణ, సుబ్బయ్య, బీవీ ప్రకాశ, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.