ప్రొహిబిటెడ్ భూమిని రిజిస్టర్ చేయకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి ఉడుములపాడు గ్రామ పరిధిలో 22ఏలో ఉన్న ఐదెకరాల అసైన్డ భూమిని బనగానపల్లె సబ్ రిజిస్ర్టార్ రిజిస్టర్ చేశారు. డోన మండలంలోని ఉడుములపాడు గ్రామ పరిధిలోని జగనన్న లేఅవుట్ పక్కన వాములమ్మ అనే మహిళకు గతంలో ఐదెకరాల డీ పట్టా భూమిని ఇచ్చారు. అసైన్డ భూమి కావడంతో ఇది ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది. 22ఏ జాబితాలో ఉన్న భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ర్టేషన్లు చేయరాదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే.. ఇటీవల బనగానపల్లె సబ్ రిజిస్ర్టార్ కార్యా లయంలో దనియాల బీబీ పేరుతో 176/1 సర్వే నెంబరులో ఐదెకరాల భూమిని రిజిస్ర్టేషన చేశారు. రిజిస్ర్టేషన చేయించుకున్న సదురు వ్యక్తి దనియాల బీబీ డోన తహసీల్దార్ కార్యాలయంలో హద్దులు చూపించాలని దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో మంగళవారం మండల సర్వేయర్ సదురు భూమిలో సర్వే చేసేందుకు వెళ్లారు. ఆ భూమిలో సాగులో ఉన్న లక్ష్మన్న, మాదన్న కుటుంబ సభ్యులు సర్వే అధికారులను అడ్డుకున్నారు. ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నామని ఆందోళనకు దిగారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై డోన ఇనచార్జి తహసీల్దార్ సత్యదీప్ మాట్లాడుతూ ఉడుములపాడు గ్రామ పరిధిలోని 22ఏలోని 176/1 సర్వే నెంబర్ భూమిని రిజిస్ర్టేషన చేయకూడదన్నారు. బనగానపల్లె సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ర్టేషనపై ఆర్డీవో మహేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.