జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో చేనేత కళాకారులు బుధవారం ఉదయం వాక్ నిర్వహించారు. స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేయనున్నారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంతో ఉత్సాహంగా వాక్‌లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు.