ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని బుధవారం మొదలైన ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సరం తరగతులను వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని పరిశీలించారు. నూతన విద్యార్థులకు వర్శిటీ నుంచి కల్పించవలసిన నీటిసరఫరా, బాత్ రూంలు పరిశుభ్రత తదితర మౌలిక వసతులపై వీసీ ఆరా తీశారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాలలోని ప్రయోగశాలలు పరిశీలించి, అవి నాణ్యతగా, సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు.