కర్నూలు జిల్లా, అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బెల్లం చెన్నప్ప (44) అనే వ్యక్తి క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. చెన్నప్ప రామాపురం గ్రామంలోని నాపరాతి పాలిష్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. మద్యానికి బానిసై భార్యతో గొడవ పడి మధ్యాహ్నం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మరియమ్మ, ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్‌బాబు తెలిపారు.