ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా.. జగన్ వ్యవహారంపై మాట్లాడారు. జెడ్ ప్లస్ భద్రత ఎవరికి ఇస్తారో తెలియని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. జెడ్ ప్లస్ భద్రత అడగటంతో జగన్ పిచ్చి పరాకాష్టకి వెళ్లిపోయిందని విమర్శించారు.