ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపునకు చున్నీతోఉరి వేసుకుని సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషా ఖురేషిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్‌కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద మిస్ అయ్యింది. మిస్ అయిన మొబైల్ ఫోన్‌ను మృతురాలు జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించి ట్రిబుల్ ఐటీ అధికారులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన జమీషా ఖురేషి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.