కర్నూలులో హైకోర్టు బెంచ ఏర్పాటు చేసి న్యాయవాదుల దీర్ఘకాలిక కోరికను సాకారం చేయాలని కర్నూలు బార్ అసోసియేషన న్యాయవాదులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరతను కోరారు. ఈ మేరకు మంగళవారం న్యాయవాదులు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా 3వేల మంది న్యాయవాదులు ఉన్నారని, అయితే.. కోర్టులలో వారికి సరైన సరిపడ వసతులు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారని, నూతన బార్ అసోసియేషన కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన అధ్యక్షుడు బి. కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరి రవి గువేరా, న్యాయవాదులు విక్రమ్ సింగ్, కె.మోహనబాబు, అస్లాంబాషా, వెంకట్రావు, గణేష్సింగ్ తదితరులు ఉన్నారు.