వార్డుల పరిధిలో వచ్చే ప్రజాసమస్యలపై వెంట నే స్పందించి వాటికి పరిష్కారం చూపాలని బొబ్బిలి ము న్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళ వారం సాయంత్రం వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, రూటు సూపర్వైజర్లు, పబ్లిక్‌హెల్త్ మేస్ర్తీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి రోజూ ప్రతి వార్డులో కాలువలు శుభ్రం చేయించాలని, వర్షపు నీటి ప్రవాహా నికి ఎక్కడా అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం, అమ్మకాలపై దాడులు, తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిం చాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనరు తన సిబ్బందితో కలి సి పూల్‌బాగ్, జంగాలవీధి, యాతవీధి, ప్రాంతాలలో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలను గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు.