ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకొని మరీ ఈ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం తీసుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు.