టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్, ఆయన కార్యకర్తలకి భయమెందుకు?. రెండు నెలలు గడవక ముందే రాష్ట్రపతి పాలన అంటున్నారు. సామాజిక బస్సుయాత్ర చేపట్టే అర్హత జగన్‌కి లేదు. జగన్ హయాంలో 28 మంది దళితులు అత్యాచారాలు, ఆపై హత్యలకు గురయ్యారు. 6 వేల మంది దళితులపై అత్యాచారాలు జరిగాయి. ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని కోటం శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ‘‘జగన్ రూ.33 వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. ఏపీ కోసం జగన్ ఏ రోజైనా రాష్ట్రపతిని కలిశాడా?. ఇవాళ రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు’’ అని అన్నారు.