మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలు వెంటనే చెల్లించాలంటూ పీలేరు గ్రామ పంచాయతీలోని కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య మాట్లాడుతూ పీలేరు గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తుండగా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అధికారులు కార్మికులను వేధిస్తున్నారన్నారు.