బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచా యతీ పరిధిలోని కాండ్లమడుగు అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్ శ్రీధర్ తనిఖీ చేసి కేంద్రం నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జేసీ ఆదర్శరాజేం ద్ర, మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ లతో కలిసి అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా రిజిస్టరులో 8మంది, సెంటరులో నలుగురు ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగనవాడీ కేంద్రాలపై దృష్టి పెట్టాలని సబ్‌కలెక్టర్‌ను ఆదేశించారు.