ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. కాగా సమావేశంలో ఆరు అంశాలు అజెండాగా ఉన్నాయి. నామినేట్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. తెలంగాణా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా పాలిట్ బ్యూరోలో నేతలతో పార్టీ అధినేత చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పొలిట్ బ్యూరో సమావేశం.