ఉపాధి హామీకు సంబంధించిన రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వ హించాలని ఎంపీడీఓ జి. వి. సుబ్బరాజు గురువారం అన్నారు. ఉరవకొండ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ టెక్నికల్, ఫీల్డు అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హౌసింగ్ స్కిమ్లో గృహనిర్మాణాలకు ఉపాధిహామీ ద్వారా 90రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. అలాగే అమృత్ సరోవర్ పనులపై సమీక్ష చేసి పలు సూచనలు చేశారు.