వెలిగండ్ల మండలం కంకణంపాడు గ్రామ సచివాలయంలో బుధవారం తల్లిపాలు వారోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అనురాధ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. బిడ్డ జన్మించిన ఆరు నెలల వరకు తల్లి ముర్రిపాలు తాగించాలని ఆమె కోరారు. బిడ్డకు ఆరు నెలలు వచ్చిన తదుపరి తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు.