ఏపీలోని పూర్వ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో టెలిసెంటర్లను ఏర్పాటుచేశారు. వీటినే ‘హబ్స్’ అంటున్నారు. కొన్ని ఎంపిక చేసిన సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రులను వీటికి అనుసంధానం చేశారు. వాటినే ‘స్పోక్స్’ అంటారు. ఎవరికైనా గుండెనొప్పి వచ్చినప్పుడు దగ్గర్లో ఉన్న చిన్న ఆస్పత్రులైన స్పోక్స్‌కు వెళ్తే.. అక్కడి వైద్యులు వారికి ఈసీజీ తీసి.. ఇంజెక్షన్ అవసరమో కాదో చెబుతారు. దాన్ని బట్టి అవసరమైనవారికి వెంటనే చిన్న ఆస్పత్రి వైద్యులే టెనెక్ట్‌ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు.