అంతర్జాతీయ గుర్తింపు పొందిన "మదర్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ని స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్లను విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గురువారం ఆవిష్కరించారు.