ఏపీలో ఇప్పటివరకు 15,077 మంది రోగులను పరీక్షించగా.. వారిలో 6,508 మందికి గుండె సమస్యలు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అందులో 840 మందికి ఇంజక్షన్ ఇచ్చి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశారు. ఈ విధానంలో అత్యవసర చికిత్సతో రోగులు ప్రయోజనం పొందుతారని, మిగిలినవారికీ సరైన వైద్యం అందుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. స్టెమిగా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు.