శింగనమల నియోజకవర్గం,నార్పల మండలం,వెంకటంపల్లి గ్రామం వద్ద హెచ్ ఎల్ సి కెనాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.రైతులతో కలసి వర్షంలో తడుస్తూ కాలువ పరిశీలన చేసిన ఎమ్మెల్యే గారు.గత వైసీపీ ప్రభుత్వం హెచ్ఎల్సి కాలువ మరమ్మత్తులు చేయకపోవడంతో పెద్ద పెద్ద బండరాళ్లతో ముసుకపోయిన కాలువలో నీరు ప్రవహించక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.చివరి ఆయకట్టుకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వీలైనంత త్వరగా కాలువ మరమ్మత్తులు చేపట్టాలని హెచ్చెల్సి అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు.ఈ కెనాల్ ద్వారా నీరు ప్రవహిస్తే పుట్లూరు మండలంలోని చాలా గ్రామాలకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని తెలిపారు.