కర్నూలు మూడో పట్టణ పోలీస్స్టేషన పరిధిలో అరుంధతీనగర్లో జైబానబీ అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. జైబా నబీ, ఆమె భర్త చాంద్బాషాలు మంగళవారం పని నిమిత్తం బయటకు వెళ్లారు. బుధవారం వచ్చి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా అంతా చిందరవందరగా ఉంది. బీరువలో ఉన్న సుమారు 4 తులాల బంగారు నగలు, వెండి నగ లు, రూ. 2లక్షల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధి తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్లూజ్ టీమ్ సాయంతో వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.